VIDEO: అంబేద్కర్ నగర్‌లో నాగుపాము కలకలం

PDPL: మంథని మండలం అంబేద్కర్ నగర్‌లో అక్బర్ ఇంట్లో నాగుపాము కనిపించింది. వెంటనే సమాచారం అందిన స్నేక్ సత్తి ఐదు నిమిషాల్లో వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. పామును సురక్షితంగా నిల్వ చేసి అడవికి వదిలారు. సత్తి ప్రతిభను స్థానికులు ప్రశంసించారు.