పరిశుభ్రతే మహాభాగ్యం: కమిషనర్‌

పరిశుభ్రతే మహాభాగ్యం: కమిషనర్‌

SRPT: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవితం సాధ్యమని మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి అన్నారు. గురువారం మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన శ్రమదానంలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛత కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం, ప్లాస్టిక్ నివారణపై అవగాహన కలిగి ఉండాలన్నారు.