'అందరికీ నిత్యవసర సరుకులు అందించాలి'
AKP: తుఫాన్ ప్రభావంతో ప్రజలందరు అవస్థలు పడుతున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ అన్నారు. మత్స్యకారులతోపాటు ఇతర కులాల వారికి కూడా బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లి తహసీల్దారు నరసింహమూర్తికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. గత వారం రోజులుగా ఉపాధి లేక అందరూ ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.