132 కెవి సబ్‌స్టేషన్ లేకనే విద్యుత్ కోతలు
MNCL: జన్నారం మండలంలో ఏర్పడిన విద్యుత్ సమస్య పరిష్కారానికి 132 కెవి సబ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. జన్నారంలో ప్రస్తుతం సాధారణ విద్యుత్ సబ్‌స్టేషన్ మాత్రమే ఉంది. అయితే విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటం, వినియోగం ఎక్కువగా ఉండటంతో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.