'భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలి'
KDP: పులివెందుల మండలంలో ఇవాళ అచ్చవల్లి గ్రామంలో 'పొలం పిలుసోంది' కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ప్రభాకర్ రెడ్డి, జిల్లా రైతు శిక్షణ కేంద్రం ఏడి అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా మట్టి నమూనాలను పరీక్ష చేయించుకోవాలన్నారు.