యువకుడిపై కత్తితో దాడి

విశాఖ: జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు కత్తితో హల్‌చల్ చేశాడు. ఆరిలోవలోని శ్రీకాంత్ నగర్ JNNURM కాలనీలో ఉంటున్న బొట్ట పృధ్వీరాజ్‌పై ప్రసాద్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వై. కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పృద్వీకి వీపుమీద తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.