'జిల్లాలో 1,446 పల్స్ పోలియో కేంద్రాలు'
AKP: జిల్లాలో ఈనెల 21వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి 1,446 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పల్స్ పోలియో జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో మొత్తం 1,97,810 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.