నేరేడుచర్ల ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్
SRPT: నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం తనిఖీ చేశారు. 11న జరిగే పోలింగ్ దృష్ట్యా సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని, బ్యాలెట్ బాక్సులను పకడ్బందీగా తనిఖీ చేసి ఎస్కార్ట్ వాహనాల్లో తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో శ్రీనివాసులు, కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.