రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
KRNL: ఆదోని-ఇస్వి రైల్వే స్టేషన్ పరిధిలోని పాత నల్ల గేట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుడిచేతిపై KC, NTR అనే పచ్చబొట్టు ఉంది. అతని జేబులో గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకున్న OP స్లిప్‌లో నరసన్న అని ఉందని రైల్వే HC సర్వేశ్వర్ తెలిపారు. ఆచూకీ తెలిస్తే ఆదోని రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.