ఎమ్మెల్యే ఆదేశాలతో రోడ్డుకు మరమ్మతులు

ఎమ్మెల్యే ఆదేశాలతో రోడ్డుకు మరమ్మతులు

ATP: గుత్తి నుంచి మంత్రాలయం వెళ్లే మార్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు కోతకు గురైంది. గుంతలు పడ్డ రోడ్డుకు మున్సిపాలిటీ అధికారులు మంగళవారం తాత్కాలిక మరమ్మతు పనులు చేపట్టారు. కమిషనర్ జబ్బర్ మీయా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జయరాం ఆదేశాల మేరకు ఈ రోడ్డు పనులను చేస్తున్నామన్నారు. మరో రెండు రోజుల్లో ఈ రోడ్డు పనులు పూర్తయితాయని తెలిపారు.