శ్రీశైలంలో యువతి రీల్స్.. VIDEO వైరల్
NDL: శ్రీశైలంలోని CRO సమీపంలో ప్రధాన రహదారిపై ఓ యువతి జానపద గీతానికి డాన్స్ చేసింది. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలా చేయడం సరికాదని, అధికారుల పర్యవేక్షణ లోపంతో కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.