VIDEO: వేమవరంలో స్వచ్ఛ రధం సేవలు
కృష్ణా: వేమవరం గ్రామంలో స్వచ్ఛ రధం తిరుగుతూ.. ప్రజల నుంచి ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం, పాత పుస్తకాలు, అట్టలు, స్టీల్ తదితర పదార్థాలను పొడి చెత్తగా సేకరిస్తోంది. ప్రజలు ఇళ్లలో పేరుకుపోయిన, వాడిపోయిన పదార్థాలను స్వచ్ఛ రధానికి అందించి, వాటికి బదులుగా సరిపడా నిత్యావసర వస్తువులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు.