BHPL బైపాస్ రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి అనుమతి

BHPL: జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ వరంగల్ ఎంపీ కడియం కావ్య చేసిన విజ్ఞప్తి కనుగుణంగా కేంద్రమంత్రి గడ్కారీ రహదారి నిర్మాణానికి అనుమతి నిచ్చారు. నానాటికి పెరిగిపోతున్న వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని రోడ్డు నిర్మాణానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కావ్య హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.