ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే
VZM: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శుక్రవారం నిర్వహించారు. ప్రజా దర్బార్‌కు మొత్తం 216 పిర్యాదులు అందాయని, అందులో అధికంగా రెవెన్యూ, హౌసింగ్ పట్టాలపై వినతి పత్రాలు వచ్చాయని తెలిపారు. అనంతరం వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.