హలో మాల చలో ఢిల్లీ కరపత్రం విడుదల
MDCL: హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షుడు అల్లిబిల్లి మహేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేతులమీదుగా హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సభకు అధిక సంఖ్యలో మాలలు తరలిరావాలన్నారు.