నామపత్రాలను అందజేసిన MLA
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలంలో సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ మద్దతుదారులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అధికారులకు నామపత్రాలను ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా సంగంకలాన్ సర్పంచి స్థానానికి భాగ్యలక్ష్మి, మౌనిక, మల్కాపూర్ స్థానానికి పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, పండరి విజయలక్ష్మి నామ పత్రాలను ఎమ్మెల్యేతో కలిసి రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు.