VIDEO: ఈ రహదారికి మోక్షం ఎప్పుడో..?
కోనసీమ: అయినవిల్లి(M) తొత్తరమూడి-కే.జగన్నాధపురం ప్రధాన రహదారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తొత్తరమూడి చెరువు నుంచి సుమారు 3 కిలోమీటర్లు రహదారి అధ్వాన్నంగా రాళ్ళు తేలి ఉండడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు మారినా రోడ్డు పరిస్తితి మాత్రం మారలేదని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.