శ్రీ సత్యసాయి బాబాకు అరుదైన గుర్తింపు

ATP: శ్రీ సత్యసాయి బాబా శత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో పుట్టపర్తి MLA పల్లె సింధూర శ్రీ సత్యసాయి బాబా జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరారు. ఎమ్మెల్యే కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ మంగళవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.