కీలిమంజారో విజయం.. కలెక్టర్ ప్రశంస

కృష్ణా: పెనమలూరు మండలానికి చెందిన అనుమోలు ప్రభాకరరావు ఇటీవల ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. శనివారం ఆయన కలెక్టర్ డి.కె. బాలాజీ కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ఘట్టం ప్రేరణగా, యువతలో జైవిక, పర్యాటక అవగాహన పెరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.