గాలికుంటు టీకాల శిబిరం తనిఖీ చేసిన జిల్లా అధికారి
SRD: పటాన్‌చెరు మండలం ఘనపూర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వెటర్నరీ ఎనిమల్ హస్బెండరీ ఆఫీసర్ (DVAHO) వసంత కుమారి సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికారిని మాట్లాడుతూ.. పశువులకు తప్పనిసరిగా గాలికుంటు టీకాలు వేయించాలని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో షెడ్యూల్ వారీగా క్యాంపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.