కాట్రియాలలో మహిళలే కీలకం..!
MDK: రామయంపేట మండలం కాట్రియాలలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా కానుంది. గ్రామంలో మొత్తం 1801 ఓట్లు ఉండగా 865 మంది పురుషులు, 936 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ స్థానానికి జనరల్ మహిళగా ప్రకటించారు.10 వార్డు సభ్యులకు గాను ఐదు జనరల్‌గా, 4 ఎస్సీ అభ్యర్థులకు, ఒకటి ఎస్టీ అభ్యర్థుల కేటాయించారు. దీంతో ఎన్నికల్లో మహిళలే కీలకం కానున్నారు.