భార్యను గొంతుకోసి చంపిన భర్త

AP: ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలం పీవీపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్యను భర్త గొంతుకోసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.