పెట్టుబడుల సదస్సుకు సిద్ధమవుతున్న విశాఖ

పెట్టుబడుల సదస్సుకు సిద్ధమవుతున్న విశాఖ

విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో పెట్టుబడుల సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో 8 హాళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌‌తో పాటు 33 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొననున్నారు. కాగా, సదస్సు ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధకృష్ణన్ హాజరుకానున్నారు.