జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
KDP: ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో బుధవారం విజ్ఞాన వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మండల స్థాయి పోటీలను ఎంఈవో సావిత్రమ్మ, శోభారాణి ప్రారంభించారు. క్విజ్, వక్తృత్వ, సెమినార్, ఫ్యాన్సీ డ్రెస్, పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు ఈనెల 6వ తేదీన జరగనున్న జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈవోలు పేర్కొన్నారు.