శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకారుల ఉత్సవం

TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీరామానుజులవారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారికి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు.