కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
KMR: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సూచించారు. సోమవారం బిక్కనూర్ మండలం తిప్పాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు.