VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: మొవ్వ మండలంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. మండలంలోని పెదపూడి గ్రామానికి చెందిన రాయన వీర కుమారికి రూ.20,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా వారి ఇంటికి వెళ్లి అందజేశారు. సహాయ నిధి అందించడం పట్ల ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.