జిల్లాలో పులి సంచారం

జిల్లాలో పులి సంచారం

MNCL: హాజీపూర్ మండలం ర్యాలీ గడ్ఫూర్ గ్రామ పంచాయతీ పరిధిలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. శనివారం ఉదయం జొన్నలరాశి సమీపంలో పులి దాడిలో ఒక ఆవు మృతి చెందింది. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి, పులి దాడి జరిగిందని నిర్ధారించారు.