భారీగా ద్రవరూప గంజాయి స్వాధీనం
ASR: చింతపల్లి మండలం లోతుపడ్డ వంతెన వద్ద పోలీసులు తనిఖీలు ఇవాళ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.1.40 కోట్లు విలువైన 11.3 కిలోల ద్రవరూప గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి ఒక వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.