అంతర్జాతీయ పోటీలలో నాలుగు బంగారు పతకాలు

అంతర్జాతీయ పోటీలలో నాలుగు బంగారు పతకాలు

అనకాపల్లి: రోలుగుంట జడ్పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయురాలు నాగజ్యోతి అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో నాలుగు బంగారు పతకాలు సాధించారు. ఈనెల 14 తేదీ నుంచి భూటాన్‌లో జరిగిన పోటీలలో ఆమె భారతదేశం తరపు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 60 మీటర్లు, 100 మీటర్ల పరుగు పందాల్లో రెండు గోల్డ్ మెడల్స్, డిస్క్ త్రో పోటీలలో గోల్డ్ మెడల్, పవర్ లిఫ్టింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వచ్చింది.