యూరియా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు: సీపీ

WGL: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యూరియా బ్యాగులను బ్లాక్ చేయడం, బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నవారిని గుర్తించడానికి స్థానిక పోలీసులు నిఘాపెట్టాలని బుధవారం పోలీసులకు ఆదేశించారు. యూరియా విక్రయకేంద్రాలకు రైతన్నలు పెద్దసంఖ్యలో తరలి వస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్ పద్ధతిని కొనసాగించాలన్నారు