మద్యం షాపుల్లో తనిఖీలు
ELR: కామవరపుకోట మండలం పరిధిలోని తడికలపూడి, కామవరపుకోట గ్రామాలలోని లైసెన్సు కలిగిన మద్యం దుకాణాలను సోమవారం ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సంబంధిత షాప్ యజమానులకు అన్ని మద్యం సీసాలను "ఏ.పీ ఎక్సైజ్ సురక్షా" యాప్ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం మద్యాన్ని అమ్మాలని చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ సూచించారు.