బీజేపీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా కార్తీకరెడ్డి

HYD: BJP జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ఆమోదం మేరకు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బీజేపీ విభాగంలో మొత్తం 8 మంది వైస్ ప్రెసిడెంట్లను నియమించారు. ఈ జాబితాలో గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి పేరు ప్రధానంగా వినిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న అనుభవం కృషిని పరిగణలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించారు.