ఇసుక ట్రాక్టర్ బోల్తా… ఇద్దరికి గాయాలు

ఇసుక ట్రాక్టర్ బోల్తా… ఇద్దరికి గాయాలు

SRCL: ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇసుకతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వల్లంపట్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ట్రాలీలో ఉన్న మరో వ్యక్తికి చేయి విరిగినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.