గ్రోత్ మేలా..పిల్లల పోషకాహారంపై అవగాహన
BHPL: చిట్యాల మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్ జ్యోతి ఆధ్వర్యంలో గురువారం గ్రోత్ మేలా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సూపర్‌వైజర్ జయప్రద హాజరై, మాట్లాడారు. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ ప్రతి నెల 1వ నుంచి 5వ తేదీలోగా అంగన్వాడీ కేంద్రాల్లో బరువు, ఎత్తు తూచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, ఆయా శైలజ మహిళలు ఉన్నారు.