రహదారిపైనే మురుగునీరు

SKLM: నరసన్నపేట మారుతి నగర్ రెండవ వీధిలో మురుగునీరు నేరుగా రహదారులపై చేరుతుందని స్థానిక వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం స్థానిక వాసులు మాట్లాడుతూ.. ఈ సమస్యపై పంచాయతీ, అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుని వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని వాపోతున్నారు. ఇటీవల తమ సొంత ఖర్చులతో పైపులు వేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.