పోలింగ్ సరళిపై కలెక్టర్ సమీక్ష
ములుగులోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతలో గోవిందరావుపేట, ఎస్.ఎస్. తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలలోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.