'రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట'

JN: మనసున్న మహారాజు సీఎం రేవంత్ రెడ్డి అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కడియం ప్రారంభించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో అందిస్తున్న సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.