మానవత్వం చాటుకున్న యువకులు
ASF: కౌటాట మండలం కన్నెపల్లి గ్రామానికి చెందిన ఇరిగిరాల జస్వంత్ (17) అనే విద్యార్థి గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల్లో గాలి బుడగలు (నిమోనియా) కారణంగా అతని పరిస్థితి విషమించడంతో వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చికిత్స ఖర్చులు భారంగా మారడంతో, గ్రామ యువకులు స్పందించి రూ. 16,000 విరాళాలు సేకరించి, కుటుంబానికి అందించారు.