మొక్కలు నాటిన ఎమ్మెల్యే నానాజీ
KKD: కరపలోని నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 'మెగా పీటీఎం 3.0' కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. మొదటగా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఎమ్మెల్యే పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.