'కూటమి ప్రభుత్వం కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసింది'
NTR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కార్మికవర్గానికి తీరని అన్యాయం చేసిందని సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న రోజుకి 8 గంటల పని విధానాన్ని మార్చి 10 గంటలకు పెంచిందని అన్నారు. ఇతర కేంద్ర కార్మిక సంఘాలన్నీ పని గంటలను తగ్గించాలని కోరారు.