VIDEO: ట్రాక్టర్ నడిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి

CTR: పుంగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం శుక్రవారం నిర్వహించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన ఛైర్మన్ సమీపతి యాదవ్ ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. ఇందిరా కూడలి నుంచి నిర్వహించిన ర్యాలీని మంత్రి ట్రాక్టర్ నడిపి ప్రారంభించారు.