'వడ్డీ లేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్‌దే'

'వడ్డీ లేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్‌దే'

SRPT: మహిళలకు వడ్డీ లేని రుణాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.