పొంచి ఉన్న తుఫాన్ ముప్పుతో రైతులు ఆందోళన
కృష్ణా: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా బలపడే సూచనలతో రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా భారీ వర్షాలు పడితే పంట దెబ్బతినే ప్రమాదం ఉందని గూడూరు రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ధాన్యాన్ని కుప్పలు వేసి, టార్పాలిన్లుతో కప్పి భద్ర పరిచాలని ఈరోజు అధికారులు సూచించారు.