విద్యార్థినిని చితకబాదిన ప్రిన్సిపాల్
NRML: ఇరువురు విద్యార్థినుల మధ్య గొడవ జరగడంతో ఒక విద్యార్థిని మరో విద్యార్థిని తల పగుల గొట్టిందని పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినిని చితకబాదిన ఘటన లోకేశ్వరం మండలంలోని ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. హద్ గాం గ్రామానికి చెందిన శృతిక శుక్రవారం తోటి విద్యార్థినితో గొడవ పడగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థినిని ఆఫీస్ రూమ్ లోకి పిలుచుకొని తీవ్రంగా కొట్టిందని శృతిక తండ్రి ఆరోపించారు.