స్విమ్స్‌లో డిగ్రీ ప్రవేశాలు

స్విమ్స్‌లో డిగ్రీ ప్రవేశాలు

TPT: ఏపీ ఈఏపీసెట్(ఎంసెట్) ర్యాంకుల ఆధారంగా స్విమ్స్‌లో అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియో థెరపీ, బీఎస్సీ అలైడ్ హెల్త్సన్సెస్(పారా మెడికల్) కోర్సులు ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.