నగరంలో పెరుగుతున్న కాలుష్యం

నగరంలో పెరుగుతున్న కాలుష్యం

HYD: కాలుష్యం పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నగరంలోని రామేశ్వరంబండలో AQI 165గా నమోదైంది. వాహనాల పొగ, చెత్త దహనం ఎయిర్ పొల్యూషన్‌కు ప్రధాన కారణాలుగా అధికారులు గుర్తించారు. దీనికి తోడు సిటీలో కట్టెల పొయ్యిల వాడకంతో గాలి నాణ్యత మరింత క్షీణించింది. ఈ కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.