కృష్ణా నదిలో కలుషిత నీరు
PLD: మాచవరం మండలం రేగులగడ్డ, వెల్లంపల్లి, వేమవరం గ్రామాల వద్ద కృష్ణా నది నీరు ఆకుపచ్చ రంగులోకి మారడం కలకలం రేపుతోంది. బుధవారం ఎంపీడీవో విష్ణు చిరంజీవి నదీ పరివాహక ప్రాంతాలను పరిశీలించి, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రిపోర్టులు వచ్చేవరకు ఎవరూ ఈ నీటిని వాడొద్దన్నారు.