మాజీ ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన చెల్లి

ప్రకాశం: మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు, తన చెల్లి సరోజ (బేబీ)తో కలిసి మార్కాపురంలోని నివాసంలో రక్షాబంధన్ వేడుక జరుపుకున్నారు. కలసపాడు నుంచి వచ్చిన సరోజ కట్టిన రాఖీని రాంబాబు స్వీకరించి, పరస్పర శుభాకాంక్షలు తెలిపారు. రాంబాబు, దుర్గాకుమారి దంపతులు సరోజకు పట్టు వస్త్రాలు, కానుకలు అందించారు.