అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
JN: చిల్పుర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల సురేష్ (30) అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. గ్రామంలోని తోటలో అతని మృతదేహం గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చెపట్టారు. మృతికి గల కారణం ఇంకా తెలియలేదు. స్థానికుల వివరాల ప్రకారం.. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.